ఈత చెట్టు ఎక్కుతున్న గణేషుడు!
NEWS Sep 11,2024 08:28 am
గణనాథుడు ఈత చెట్టు ఎక్కాడు! సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో గౌడ కౌండిన్య యూత్ ఈ వినాయక చవితి ఉత్సవాలను వినూత్నంగా జరుపాలని సంకల్పించింది. కుల వృత్తి గీతాకార్మికుల నేపథ్యంలో మట్టితో ఈత చెట్టు పైన గణపతి విగ్రహాన్ని రూపొందించారు. కింద తమ భక్తుడు పూజిస్తున్నట్టుగా ఉంది. ఈతచెట్టు గణపతిని చూడడానికి భక్తులు వస్తూ, ఫోటోలను తమ ఫోన్‌లో తీసుకుంటున్నారు.