బస్సు ప్రమాదం - నేటికి ఆరేళ్లు
NEWS Sep 11,2024 08:10 am
మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగి నేటితో ఆరేళ్లు పూర్తయింది. ఈ ఘటనలో దాదాపుగా 110 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి కొండగట్టు ఘాటు రోడ్డు లోయలో పడి 65 మంది వరకు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడిన వారు ఇప్పటికీ జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఘాట్ రోడ్డుకు ఇరువైపులా మూల మలుపుల వద రక్షణ గోడలు, తక్కువ ఎత్తుతో వేగ నియంత్రికలు నిర్మించింది. ఈ ఘటన దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదంగా నిలిచింది.