పొక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి
NEWS Sep 11,2024 08:13 am
ములుగు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ముఖ్యంగా బాలికలు పోక్సో లాంటి చట్టం గురించి తెలుసుకోవాలని భరోసా సెంటర్ కౌన్సిలర్ అనూష, కో ఆర్డి నేటర్ తిరుమల సూచించారు. ములుగులోని బిట్స్ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ కొలగాని రజినీకాంత్ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బాలికలు ఆత్మస్థైర్యంతో ఉండాలని అన్నారు. తమ పై జరిగే మానసిక, భౌతిక దాడులకు తమను తాము రక్షించు కోవడానికి అవగాహన పెంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం నిత్యం పర్యవేక్షిస్తూ భరోసా కల్పించారు.