మెదక్: నవరాత్రుల్లో భాగంగా పట్టణంలోని జంబికుంటలో ఏర్పాటు చేసిన సూర్య వినాయక మండపంలో ఘనంగా గణపతి హోమం నిర్వహించారు. ఉదయం నిత్య, విశేష పూజలు, హోమం, పూర్ణాహుతి చేపట్టారు. సతి సమేతంగా హాజరైన వారికి హోమ క్రతువులు జరిపించి వారికి బ్రాహ్మణులు ఆశీర్వాదాలు అందించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.