జగిత్యాల: వీధి కుక్కల పట్టివేత
NEWS Sep 11,2024 08:08 am
జగిత్యాల పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువ ఉన్న 42వ వార్డు, ఖాజా మహల్, ఉస్మాన్ పురతో పాటు పలు వీధుల్లో కౌన్సిలర్ మన్సూర్ పర్యవేక్షణలో బుధవారం తెల్లవారు జామున మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకున్నారు. సుమారు 50 కుక్కలను పట్టుకుని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించగా, మిగతా కాలనీల్లోనూ కుక్కలను పట్టుకుంటామని చెప్పారు.