జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
NEWS Sep 11,2024 08:11 am
జగిత్యాల జిల్లాలో రాగల 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస పరిశోధన స్థానం సాంకేతిక అధికారిణి శ్రీలక్ష్మీ తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22-24, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతాయని, గాలిలో తేమ శాతం 61-93 శాతం ఉంటుందని చెప్పారు.