నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
NEWS Sep 11,2024 08:15 am
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డా. గాయత్రి దేవి సంగారెడ్డి పట్టణంలోని శిశురక్ష-చరిత ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో వైద్యుల ఫీజు, రక్త పరీక్షల ధరల పట్టిక, ఫైర్‌సెఫ్టీ సిస్టంలు లేవు. డెంగ్యూ కేసుల విషయంలో రక్త పరీక్షలు ఇష్టానుసారంగా చేస్తూ, పరిశుభ్రత రికార్డులు మెంటైన్ చేయకుండా రోగులకు అయోమయానికి గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ల్యాబ్‌లను సీజ్ చేశారు.