అరచేతిలో ప్రాణాలు..
భుజాన సరకులు..
NEWS Sep 11,2024 09:20 am
డుంబ్రిగుడ: గెడ్డల ఉద్ధృతితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డుంబ్రిగుడ సమీపంలోని పెద కోసంగి, కోసంగి గ్రామాల మధ్యలో గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. పీకల్లోతు ప్రవాహంలో గెడ్డను దాటుకుంటూ మండల కేంద్రానికి వస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇక్కడ వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.