హైడ్రాకు పోలీస్ సిబ్బంది కేటాయింపు
NEWS Sep 11,2024 10:43 am
హైదరాబాద్: చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 18 మంది సీఐ స్థాయి, 5 గురు ఎస్సై స్థాయి పోలీసు అధికారులను హైడ్రాకు కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్ ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.