ఖాళీ సీట్లకు తక్షణమే భర్తీ
NEWS Sep 10,2024 06:05 pm
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలల్లో (బాలికలకు) జగిత్యాల, మెట్‌పల్లి (బాలురకు) మేడిపల్లి, కోరుట్ల, గొల్లపల్లిలో 5 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన SC విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా సమన్వయ అధికారి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈనెల 12న గురుకుల పాఠశాల చింతకుంట, కరీంనగర్ లో తక్షణ ప్రవేశాలు కల్పించబడతాయని అన్నారు.