రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరణ
NEWS Sep 10,2024 05:59 pm
మల్లాపూర్: మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారిని లావణ్య రుణమాఫీ కాని రైతుల వివరాలను ఇంటింటికి వెళ్లి సేకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీకి అర్హత ఉండి కుటుంబ నిర్ధారణ లేకపోవడం వల్ల రుణమాఫీ కాని రైతుల వివరాలను ఇంటింటికి వెళ్లి సేకరించారు. అనంతరం కుటుంబ నిర్ధారణ చేసి ధృవీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సంధ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.