చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలి
NEWS Sep 10,2024 06:04 pm
వేములవాడ: మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవలని, మారుమూల ప్రాంతాల ప్రజలు ఐక్యతగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. చందుర్తి మండల కొత్తపేట, సనుగుల గ్రామల యువతకు స్పోర్ట్స్ కిట్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ASP శేషాద్రిని రెడ్డి, CI వెంకటేశ్వర్లు, SI అశోక్, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.