సీఎం రేవంత్ రెడ్డి పవర్ లూం కార్మికులకు వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఒక కోటి 30 లక్షల చీరల ఆర్డర్, డ్వాక్రా మహిళా మండలి సభ్యులకు ఏడాదికి 2 చీరలు చొప్పున కేటాయించడాన్ని స్వాగతిస్తూహర్షిస్తున్నామని ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సిరిసిల్ల రవీందర్ చేరాల అశోక్, మండల రాజులు అన్నారు. సిరిసిల్లలో ఆసాముల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి CM, ఉప ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారు.