ప్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా అరకులోయ సిఐ హిమగిరి ప్రజలతో మమేకమౌతున్నారు. ఈ క్రమంలో అరకులోయ మండలం, యండపల్లివలస గ్రామస్తుల ఆహ్వానం మేరకు వినాయక చవితి వేడుకలలో సిఐ హిమగిరి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సిఐ మాట్లాడుతూ.. నాటుసారా, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమానంగా ఉన్నా తనకు తెలియజేయాలని సూచించారు. పోలీసు అనే భయం వద్దని అంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తెలిపారు.