సాహితీ లోకానికి తీరని లోటు
NEWS Sep 10,2024 06:06 pm
ప్రముఖ పండితులు డా. ఆయాచితం నటేశ్వరశర్మ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని వర్గల్ క్షేత్ర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ, యాయవరo చంద్రశేఖరశర్మ సిద్ధాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వర్గల్ క్షేత్రంతో ఎంతో అనుబంధం కలిగిన ఆయన అవధాన భారతి పురస్కారం అందుకున్నట్లు గుర్తు చేశారు. సంస్కృతాంద్ర విద్వత్కవిగా ప్రసిద్ధికెక్కిన ఆయనను ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాశరధి కృష్ణమాచార్య పురస్కారంతో సత్కరించిందన్నారు.