సీఎం స్వగ్రామంలో ఇంటింటికి సోలర్
NEWS Sep 10,2024 03:47 pm
సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి పూర్తి సౌరశక్తితో నడిచే తొలి గ్రామంగా రూపొందనుంది. 100 శాతం సౌరశక్తితో నడిచే ఆవాసాలకు నమూనాగా ఈ గ్రామాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. సీఎం ఆదేశాలతో అధికారులు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టింది. గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి డీపీఆర్ తయారు చేసి, ప్రాజెక్టును పూర్తి చేస్తారు.