10 లీటర్లు సారాతో వ్యక్తి అరెస్టు
NEWS Sep 10,2024 06:07 pm
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో 10 లీటర్ల సారా తో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మంగళవారం గంగంపాలెం గ్రామంలో సారా అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేసినట్లు తెలిపారు.సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి పది లీటర్లు నాటు సారాను స్వాధీన పరుచుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిస్తున్నామన్నారు.