కలెక్టర్ పాఠశాల తనిఖీ
NEWS Sep 10,2024 03:50 pm
మల్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారా లేదా అని విద్యార్థులతో పాటు క్లాస్ రూమ్ లో కూర్చుని టీచర్ బోధనను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, జిల్లా పంచాయతీ అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, తదితరులు పాల్గొన్నారు.