చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
NEWS Sep 10,2024 03:53 pm
సిరిసిల జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరనారి, కమ్యూనిస్టు ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుద పోరాటమని కొనియాడారు.