రాజన్న సిరిసిల్ల జిల్లా: భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం పెత్తందారులపై చిట్యాల ఐలమ్మ పోరాటం చేశారని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం అన్నారు. సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్బంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు కవులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూకంటి జగన్నాథం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విసునూరు దేశ్ ముఖ్ లపై తిరుగుబాటు చేసి రజాకార్లను తరిమికొట్టారని తెలిపారు. బహుజనులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.