గణేష్ ఉత్సవాలను సైబర్ నేరాలకు అవగాహన కల్పించేందుకు ఉపయోగించుకున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ ‘యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్’ సభ్యులు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా మండపాన్ని ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ Xలో పోస్ట్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనతో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.