పున్నంచందర్ మనో వికాస సదస్సు
NEWS Sep 10,2024 03:59 pm
సిరిసిల్ల: సమాజంలో విస్తృత చర్చ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కనుకుంట్ల పున్నం చందర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ లో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆధ్వర్యంలో పవర్ లూమ్స్ కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ మనో వికాస సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల నివారణకై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతున్నాయని అన్నారు.