సదరం శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
NEWS Sep 10,2024 03:15 pm
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిర్వహించిన సదరం శిబిరాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు.ఆర్థో వైకల్య నిర్ధారణ పరీక్షలకు 55 మంది దరఖాస్తు చేసుకోగా, 49 మంది హాజరు అయినట్లు ఆర్ఎంఓ సాయి కుమార్ తెలిపారు. శిబిరంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్ కుమార్, ఎముకల వైద్య నిపుణురాలు డాక్టర్ సాధన తదితరులు పాల్గొన్నారు.