ములుగు: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ములుగులోని వీవర్స్ కాలనీలో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో విఘ్న నాయకునికి భక్తులు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. వలుపదాసు స్వప్న సతీష్ దంపతులు, దుబాసి వినయ్ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దాతలుగా వ్యవహరించి భక్తులకు అన్నదానం నిర్వహించారు. గణపేశ్వరుని పూజించడం ద్వారా విఘ్నలు తొలగి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అర్చకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.