దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవ పడి కొడుకు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమి పంపకం చేయాలని తండ్రి వెంకయ్యతో కొడుకు గంట బాలయ్య (39) 3న గొడవపడ్డాడు. పెద్దల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని తండ్రి చెప్పడంతో ఇంట్లోకి వెళ్లి గడ్డి మందు గుళికలు మింగాడు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు