ఇందిరా మహిళాశక్తితో ఆర్థిక ప్రగతి
NEWS Sep 10,2024 03:57 pm
రాజన్న సిరిసిల్ల: ఇందిరా మహిళాశక్తి పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగతి పథానికి దోహదపడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని మెడికల్ కళాశాలలో తంగళ్ళపల్లికి చెందిన మార్కండేయ మహిళా సమాఖ్యకు రూ.3 లక్షల రుణం మంజూరు కాగా, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.