పేకాట స్థావరంపై దాడి
NEWS Sep 10,2024 03:48 pm
సిద్దిపేట పట్టణ శివారులోని రంగీలా దాబా చౌరస్తా సమీపంలో పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, సిద్దిపేట టూ టౌన్ పోలీసుల దాడి చేశారు. దాడిలో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట టూ టౌన్ పోలీస్ లు వివరించారు. వారి వద్ద నుంచి రూ. 8,365 నగదు, 11 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.