ఉత్తమ ఉపాధ్యాయుడికి కలెక్టర్ సన్మానం
NEWS Sep 10,2024 03:56 pm
కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ గా చేస్తున్న పాకాల శంకర్ గౌడ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మంత్రుల నుంచి పాకాల శంకర్ గౌడ్ అవార్డు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆయన మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలువగా, టీచర్ ను కలెక్టర్ సన్మానించి,ఆయన విద్యార్థులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.