9 నెలల్లోనే 76 వేల కోట్ల అప్పు
NEWS Sep 10,2024 01:35 pm
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రస్తావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయన కూడా భారీ స్థాయిలోనే అప్పులు చేస్తున్నారంటూ BRS విమర్శిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే.. ఏకంగా 75,995 వేల కోట్ల అప్పు చేసినట్టుగా BRS నేతలు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో చిట్టా పద్దు పెట్టారు. జులైలో రూ.7000 కోట్లు, ఆగస్టులో రూ.6000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయగా.. సెప్టెంబర్ 3న 1000 కోట్లు అప్పు తీసుకుంది. ఈరోజు మరో 1500 కోట్లు అప్పు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.