సమైక్యతతో ఉత్సవాలను జరుపుకోవాలి:
ధార్మిక సేవా సమితి
NEWS Sep 10,2024 11:49 am
ధార్మిక సేవ సమితి జోగిపేట ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మండపాల్లో భరతమాత, బాలగంగాధర్ తిలక్ చిత్రపటాలు అందజేశారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల విశిష్టతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, సమైక్యతతో పండుగను జరుపుకోవాలని కోరారు. స్వాతంత్రోద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్ భారతీయులను ఏకత్రాటిపైకి తెచ్చేందుకు 1893లో ముంబైలో ఉత్సవాలను ప్రారంభించారని గుర్తు చేశారు.