అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామపంచాయతీ పరిధిలోని కమ్మిరెడ్డిపాలెంలోని ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీ నీరు ఎటూ వెళ్లకుండా రోడ్డు పైనే పారుతుంది. డ్రైనేజీ పూడుకుపోయి నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు నిల్వ ఉండడం వలన దోమలు వృద్ధి చెంది అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు .పంచాయతీ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.