చాకలి ఐలమ్మకు నివాళులు
అర్పించిన మున్సిపల్ చైర్మన్
NEWS Sep 10,2024 11:39 am
KMR: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి నివాళి అర్పించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ వీరవనితగా, ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా ఐలమ్మ నిలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించిందన్నారు.