ఆత్మహత్యల నివారణ గురించి
అవగాహన కల్పించాలి: కలెక్టర్
NEWS Sep 10,2024 11:42 am
మానసిక ఒత్తిడి, సమస్యలతో బాధపడేవారు మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా ప్రజలకు సూచించారు. ఆత్మహత్యల నివారణ దినం సందర్బంగా టోల్ ఫ్రీ నెంబర్14416 పోస్టర్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎంహెచ్ఓ వసంతరావుతో కలిసి ఆవిష్కరించారు. ఆత్మహత్యల నివారణ గురించి అవగాహన కల్పించాలని, యువత, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.