బతుకమ్మ చీరల స్థానంలో సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించే విధంగా నాణ్యమైన చీరల తయారీకి ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని కాంగ్రెస్ నాయకులు గోనె ఎల్లప్ప తెలిపారు. సిరిసిల్లలోని నేతన్నచౌక్ వద్ద సీఎం రేవంత్ చిత్ర పటానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గోనె ఎల్లప్ప మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఆర్డర్ల స్థానంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంవత్సరానికి నాణ్యమైన రెండు చీరలు అందిస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామన్నారు.