రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలో బివై నగర్ లోని అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ సోమవారం హైదరాబాద్ లో జరిగిన చేనేత సభలో సిరిసిల్ల పవర్లూమ్ కార్మికుల ఉపాధి నిమిత్తం కోటి 30 లక్షల చీరలు దాదాపు 8 కోట్ల పైచిలుకు మీటర్ల ఆర్డర్లు ఇస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షనీయమని తెలిపారు.