HYD: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు వద్దని పిటిషనర్ వేణుమాధవ్ వాదనలు వినిపించారు. హైడ్రాను ఇందులో ప్రతివాదిగా చేర్చాలని కోరారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి లైన్ క్లియర్ అయింది.