బోగత జలపాతం. తెలంగాణలోని అతి పెద్ద జలపాతం. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హోయాలతో అద్భుతంగా కనిపిస్తుంది. భారీ వర్షాలతో ఇటీవల బోగత జలపాతం సందర్శనను నిలిపివేశారు. వరద ఉధృతి కాస్త తగ్గడంతో మళ్లీ జలపాతం సందర్శనకు పర్యాటకులను మళ్లీ అనుమతించారు.