మల్లాపూర్ మండలంలోని గ్రామాల్లో జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్ మంగళవారం పర్యటించారు. అటవీ శాఖ తరఫున ఏర్పాటు చేసిన వన నర్సరీలను పరిశీలించి మొక్కలు ఏ మేరకు ఎదగాయనే విషయంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు ఎదుగుదల పై చర్చించారు. మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటించాలని సిబ్బందికి సూచించారు.