సిరిసిల్ల: రోడ్డు ప్రమాద బాధితులకు గడువులోగా సాయం అందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. హిట్ అండ్ రన్ అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్,ఆయా శాఖల అధికారులతో నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులకు నిర్ణయించిన గడువులోగా రెవెన్యూ, పోలీస్ అధికారుల నివేదిక ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఈసమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.