కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కు
అనుమతి ఇవ్వండి: బండి సంజయ్
NEWS Sep 10,2024 10:32 am
కరీంనగర్ హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన బండి సంజయ్ ఈ మేరకు లేఖను అందజేశారు. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ. 1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.