రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని చాకలి ఐలమ్మ చౌరస్తాలో సిరిసిల్ల రజక సంఘం వారి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా పాల్గొని చాకలి ఐలమ్మ కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిందం కళా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. భూ హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని కోరారు.