తెలంగాణ వీర వనిత చిట్యాల (చాకలి) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఐలమ్మ భూ పోరాటం ద్వారా ఎంతో మంది భూమిలేని పేదలకు భూమి పంపకాలు జరిగాయని గుర్తు చేశారు. మహిళ ధైర్య సాహసాలకు ఐలమ్మ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.