HYD: బీసీ కులగుణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో కులగణన ప్రాసెస్ కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫున అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు.