విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి.
NEWS Sep 10,2024 01:14 pm
రాజన్న సిరిసిల్ల: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయంలో విద్యార్థులకు వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యాలయ ఆవరణ, తరగతి గదులు, కిచెన్, తదితర వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.