వర్షాల నష్టాన్ని గుర్తించండి: MLA
NEWS Sep 10,2024 10:26 am
అరకు: మాడగడ గ్రామంలోని వరద భాదితులకు కుటుంబానికి 5కేజీల బియ్యం పంపిణీ చేశారు MLA రేగం మత్స్యలింగం. ఈ మేరకు వరద నీరు రావడానికి గల కారణాలను స్ధానికులను అడిగి తెలుసుకున్నారు. సన్రైజ్ పాయింట్ కు నిర్మిస్తున్న రోడ్డులో గ్రామంలో కొత్త డ్రైనేజ్ వ్యవస్థ కావాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారీ వర్షాల వలన జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలను గుర్తించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.