వరద పెరుగుతోంది అధికారులు..
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
NEWS Sep 10,2024 01:13 pm
రానున్న 48 గంటల్లో గోదావరికి భారీగా వరద పెరగనుందని సమాచారంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో మాట్లాడుతూ ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.