అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నూతన సీఐగా ఆర్. భీమరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమరాజు గతంలో జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ లలో ఎస్సైగా పనిచేసారు. ఈ సందర్భంగా భీమరాజు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తానని తెలియజేశారు.