రోడ్లపై గుంతలతో ఇబ్బందులు
NEWS Sep 10,2024 11:00 am
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మల్యాల మండలంలో రోడ్లు పలుచోట్ల దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీంతో ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు వాపోయారు. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.