నోటీస్ బోర్డులో ఫీజు వివరాలు తెలపాలి
NEWS Sep 10,2024 01:12 pm
సిరిసిల్ల: ప్రైవేట్ యాజమాన్యాలు ఇస్టాను రీతిలో అన్యాయంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఏ తరగతికి ఎంత ఫీజు అనే వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారికి ఎ.రమేష్ కి వినతి పత్రం అందజేశారు. రవిగౌడ్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో నోటీస్ బోర్డులో ఫీజు వివరాలు తెలపాలని, ఈ మేరకు డీఈవో దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.