అరకు: సోలార్ పంపు పనిచేయక పోవడంతో తాగు నీటికి బోందుగూడ గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ మండలం, కొత్తభల్లుగూడ పంచాయితీ బోందుగూడలో తాగునీటి కొరకు ఊటలపై ఆధారపడుతుతున్నారు. గ్రామంలో ఉన్న సోలార్ పంపు సరిగా పనిచేయడంలేదని, గాలికొండ నుండి వచ్చే కొలాయి నీరు రెగ్యులర్ గా రాకపోవడంతో పంట భూములలో, గెడ్డలలో వచ్చే ఊటలే ఆధారమన్నారు.